
జనసముద్రం రామకృష్ణాపూర్ జూన్ 18
రామకృష్ణాపూర్ లయన్స్ క్లబ్,లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల వారు సంయుక్తంగా నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ లో భాగంగా పట్టణంలోని శ్రీలక్ష్మీ గణేష్ మండపం వద్ద ఉచిత కంటి వైద్యశిభిరం నిర్వహించారు.డిస్ట్రిక్ట్ ఐ క్యాంప్ ఛైర్మెన్ మోదుంపురం వెంకటేశ్వర్ ఆద్వర్యంలో వైద్యులు సుగుణాకర్ రెడ్డి,లత 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స అవసరమైన 35 మందిని ఉచిత బస్సు సౌకర్యం,ఉచిత భోజన సౌకర్యం కల్పించి ఈ 30న రేకుర్తి ఆస్పత్రికి తరలించి శాస్త్ర చికిత్స చేయిస్తామని రామకృష్ణాపూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు గాజుల రాజేష్ కన్నా తెలిపారు.ఈ. కార్యక్రమంలో రామకృష్ణాపూర్ లయన్స్ క్లబ్ కార్యదర్శి పాకాల శ్రీనివాస్ రెడ్డి,కోశాధికారి
ఆడెపు లక్ష్మణ్ కోశాధికారి,ప్రోగ్రాం ఛైర్పర్సన్ కిష్టయ్య, జెడ్సీ మంద వేణుగోపాల్,పిజెడ్సీ ఆడెపు తిరుపతి, పిఆర్సి కంభగోని సుదర్శన్,సభ్యులు సత్యనారాయణ,వెంకటేశం,దేవేందర్,రాజు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.