
మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ
హకీంపేట్ కరీంనగర్ అదిలాబాదులో ఉన్న క్రీడా పాఠశాలలు
జనసముద్రం న్యూస్ జూన్ 18
ఎల్కతుర్తి మండలం.
2025–26 సంవత్సరానికి గాను 4వ తరగతి ప్రవేశానికి విద్యార్థిని విద్యార్థుల ఎంపిక గురించి మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ ఒక ప్రకటనలో ఈ విధంగా తెలియజేశారు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను నాలుగవ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థినీ విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
మూడు అంచెల్లో ఎంపిక ప్రక్రియ
హకీంపేట్, కరీంనగర్, అదిలాబాదులో ఉన్న క్రీడా పాఠశాలలకు మూడు అంచేల్లో ఎంపిక విధానం ఉంటుంది 16 జూన్ నుండి 19 జూన్ వరకు మండల స్థాయి ఎంపిక, మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులు జిల్లా స్థాయిలో 23 జూన్ నుండి 26 జూన్ వరకు అందులో ఎంపికైన విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో జులై 1 నుండి జూలై 5 వరకు ఎంపిక జరుగుతుంది హకీంపేటలో బాలులకు 20 సీట్లు, బాలికలకు 20 సీట్లు, కరీంనగర్ లో బాలలకు 20 సీట్లు, బాలికలకు 20 సీట్లు, అదేవిధంగా అదిలాబాదులో బాలురకు 20 సీట్లు, బాలికలు 20 సీట్లు, మొత్తం 120 సీట్లకు ఈ ఎంపిక జరుగుతుంది.
30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్స్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, ఎనిమిది వందల మీటర్ల రన్, 6 × 10 మీటర్ల సెటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, ఎత్తు, బరువు, మొత్తం తొమ్మిది విభాగాల్లో 27 మార్కులకు గాను ఫిజికల్ పరీక్షలు నిర్వహిస్తారు. వయసు ధ్రువీకరణ పోస్టర్ బోన్ నార్మల్ లేడీస్ లో మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. తేదీ 01–09– 2016 నుండి 30–08– 2017 మధ్యన జన్మించి 8 నుండి 9 సంవత్సరాలు వయసు కలిగిన వారు ఈ పోటీలకు అర్హులు. తేదీ 07– 06– 2025 నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది, విద్యార్థినీ విద్యార్థులు తమ మొబైల్ నెంబర్ నుండి కానీ, tgss.telangana.gov.ina లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చును, అదేవిధంగా ఈ ప్రవేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం కొరకు ఒక ప్రత్యేక క్యూఆర్ కోడ్ కూడా రూపొందించి విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరిగింది. మరింత సమాచారం కొరకు పరీక్షలు నిర్వహించే తేదీ ప్రదేశము మరియు ఇతర వివరాలకు జిల్లా క్రీడా మరియు యువజన శాఖ అధికారిని సంప్రదించవచ్చును. విద్యార్థులు తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి కావున మండల స్థాయి విద్యార్థులు పోటీలు తేదీ 20–06–2025 శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుండి కార్మిల్ కాన్వెంట్ హై స్కూల్ మైదానంలో నిర్వహించబడును. ప్రధానోపాధ్యాయులు ఆసక్తిగల నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బోనఫైడ్ (స్టడీ డేట్ అఫ్ బర్త్) సర్టిఫికెట్స్ ను జారీ కర్నే మండల ఎంపిక క్రీడలకు పంపించగలరని తెలియజేయునైనది. ఇట్టి అవకాశంను తల్లిదండ్రులు ఉపయోగించుకోవాల్సిందిగా మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ తెలిపారు ఈ సమావేశంలో మండల వ్యాయామ ఉపాధ్యాయులు రాముడు, ప్రేమ్ ప్రసాద్, తిరుపతి, శ్రీకాంత్, ఉదయ్, ఉషారాణి పాల్గొన్నారు