
మహిళ మృతికి కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు
జనసముద్రం న్యూస్, మదనపల్లి, జూన్ 18:-
కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి మహిళ ఆత్మ హత్య చేసుకుంది. తీవ్ర కలకలం రేపిన ఘటనకు సంబంధించి మృతుని కుటుంబీకులు, పోలీసుల కథనం.అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం, రామసముద్రం మండలం, కాప్పల్లికి చెందిన సంతోష్ భార్య కె.అహల్య(27) మంగళవారం కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైంది. టమాటా చెట్లకు కొట్టడానికి తెచ్చి ఇంట్లో ఉంచిన పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు దర్యాప్తులో ఉంది.