
జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జూన్ 18
.ఆవులయ్య* వారి ఆదేశాలు ప్రకారం ఇస్తఫ్ ఎస్ జి.పాండు రంగారావు , ఇస్తఫ్ సి.ఐ. ఆర్.సత్యవతి , ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు సి.ఐ ఫణి కుమార్ చింతలపూడి సి.ఐ పి.అశోక్ భీమడోలు ఎస్ .ఐ. రామస్వామి మరియు సిబ్బంది సంయుక్తంగా చింతలపూడి స్టేషన్ పరదిలో , చింతలపూడి మండలం లోనీ దేశవరం గ్రామము లో ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కనిపేడ రవి కుమార్ కు సంబంధించిన (800) లీటర్ల పులిసిన బెల్లపు ఊట ను ధ్వంసం చేసి, అతని వద్ద నుండి (5) లీటర్లు నాటు సారాయి ను , (20) కాగ్స్ బెల్లం ను స్వాధీన పరచుకొని , అతనికి బెల్లం సరఫరా చేసిన వ్యక్తి చింతలపూడి కుమార్ ట్రేడర్స్ కిరాణా షాపు యజమాని అయిన జల్దు పార్థ శేషగిరి రావు ఇరువురు పై కేసు నమోదు చేసి , మరియు నాటు సారాను ప్రగడవరం గ్రామము నకు చెందిన కోనేకల్ల ప్రసాద్ వ్యక్తి కు సరఫరా చేస్తున్నట్టుగా విచారణ లో తేలగా , సదరు వ్యక్తి పై పరారీ కేసు నమోదు చేయడమైనది!
అలాగే చింతలపూడి మండలం , నాగిరెడ్డిగూడెం గ్రామము లో సభవతు పద్మ కు సంబంధించిన (100) లీటర్లు పులిసిన బెల్లపు ఊట ను ధ్వంసం చేసి , ఆ మహిళ పై కేసు నమోదు చేయడమైనది!
ఈ కార్యక్రమంలో స్థానిక చింతలపూడి ఎక్సైజ్ ఎస్.ఐ.లు, అబ్దుల్ ఖలీల్ , జె.జగ్గారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు అని చింతలపూడి సి.ఐ. పి.అశోక్ తెలిపినారు!