
మొహమ్మద్ అబ్దుల్ రఫీ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి
జాతీయ లోక్ అదాలత్ లో లో 2437 కేసుల పరిష్కారం
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ జూన్ 15
మహబూబాబాద్ జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ మాట్లాడుతూ కోర్టులో కేసును చివరిదాకా నడిపించుకుంటే ఒక్కరు మాత్రమే గెలుస్తారని, అదే లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకుంటే ఇద్దరూగెలిచినట్లేనని,సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని వేగవంతముగా పొందవచ్చునని
ఇరు ఇరుపక్షాలకు ఆమోద యోగ్యమైన తీర్పును ఆశించవచ్చని, మానసికంగా, శారీరకంగా ప్రశాంతమైన జీవనాన్ని పొందాలని ఖర్చు మరియు కాలయాపన లేకుండా, అప్పీలు లేని అంతిమ తీర్పును పొందవచ్చని, కావున కక్షిదారులు ఈ సదవకాశాన్నీ ఉపయోగించుకోవాలని జడ్జి చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కృష్ణ తేజ్, జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాది నగేష్ కుమార్, న్యాయవాదులు, వివిధ సర్కిల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, కోర్ట్ కానిస్టేబుల్స్, కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు. జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 2437 కోర్టుకేసులు,5465 పోలీస్ చలాన కేసులు పరిష్కారం అయినట్లు తెలిపారు వీటిలో 15మోటార్ వాహన ప్రమాద కేసుల్లో 59 లక్షల 85 వేల రూపాయల నష్టపరిహారాన్ని బాధితులకు చెల్లించే విధంగా ఆదేశించినైనది. 497 క్రిమినల్ కేసుల్లో నేరాన్ని అంగీకరించిన వారికి 32 లక్షల 88 వేల 400రూపాయల జరిమానా విధించనైనది. 17 సైబర్ నేరాల కేసులు పరిష్కారమవ్వగా వాటిలో 2,62,160 రూపాయలను బాధితులకు తిరిగి ఇచ్చే విధంగా ఆదేశించనైనది 53 టెలిఫోన్,సైబర్,మరియు బ్యాంకు, 388222 సంబంధిత కేసులు పరిష్కారం అవ్వగా వాటిలో కక్షిదారులు 13 వేల170 రూపాయలు చెల్లించి రాజీ చేసుకున్నారు.7 సివిల్ కేసులు, 4 చెక్ బౌన్స్ కేసులు, పరిష్కారం అయినాయి