
జనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం జూన్ 8 మెదక్ జిల్లా
చిన్న శంకరంపేట మండలం మాడూరు గ్రామంలో ఉపాధిహామీ కూలీల పనితీరును మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను వినియోగించుకోవాలన్నారు. ఉపాధి పనులు భాగంగా చేపల చెరువుతో మత్స్యకారులకు లాభం జరుగుతుందని కూలీలు కూడా పని లభిస్తుందని అన్నారు. వారితోపాటు ఎంపీడీవో దామోదర్, ఏపీవో రాజ్ కుమార్ టెక్నికల్ అసిస్టెంట్ సంపత్, శ్రీనివాస్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు సురేష్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ సునీత, వేణుగౌడ్, తదితరులు పాల్గొన్నారు