జనసముద్రం న్యూస్ జైపూర్ జూన్ 8:
జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో డీజీఎం (పర్సనల్) గా విధులు నిర్వహిస్తున్న అజ్మీర తుకారం , సింగరేణి అంతర్గత బదిలీలలో భాగంగా ఇల్లందు ఏరియా డీజిఎం (పర్సనల్) బదిలీ అయిన సందర్భంగా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ అధికారులు ఉద్యోగులు శనివారం రోజున ఘనంగా సన్మానించారు, తోటి అధికారులు అజ్మీర తుకారం తో కలిసి పని చేసిన అనుభవాలను, అజ్మీర తుకారం జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ కు సింగరేణి సంస్థకు చేసిన సేవలను కొనియాడారు, ఈ కార్యక్రమంలో ఈ డి సి హెచ్ చిరంజీవి, జనరల్ మేనేజర్ కే. శ్రీనివాసులు, జె ఎన్ సింగ్, అధికారుల సంఘం బ్రాంచ్ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాస్, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాగూర్ మోహన్ సింగ్ పాల్గొన్నారు








