ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ జూన్ 07
ఖానాపూర్ నియోజకవర్గంలోని
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ పులుల అభయారణ్యంలో రాష్ట్ర కోర్టు ప్రభుత్వ ప్లీడర్లు సందర్శించి వన్యప్రాణులను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా హైకోర్టు ప్రభుత్వ ప్లీడరు మహేష్, రాజుతో పాటు 12 ప్లీడర్ల బృందం మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని గొండు గూడ, మల్యాల వాచ్ టవర్, బైసన్ కుంట, నీలు గాయికుంట, సోలార్ బోర్వెల్స్, అటవీ ప్రాంతలల్లో శుక్రవారం రోజున ఉదయం 7 గంటల సమయం లో టూరిజం సఫారీ వాహనాల్లో ఒకటవ నెంబర్ గేట్ ద్వారం, ద్వారా వెళ్ళి అడవిలోని ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.

మల్యాల అడవుల్లోని వాచ్ టవర్ పైకి వెళ్లి అటవీ అందాలను ఆస్వాదిస్తూ పచ్చని పకృతికి పరవశించిపోయిన ప్రభుత్వ ప్లీడర్లు. . అడవుల్లో మార్గం మధ్యలో చెట్ల పొదల్లో జింకలను, పలు రకాల పక్షులను, అటవీ అందాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తాళ్లపేట రేంజ్ ఆఫీసర్, జన్నారం రేంజ్ ఇంచార్జి సుష్మారావు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మమత, వారి వెంట లక్షెట్టిపేట సీఐ డి.రమణమూర్తి, స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష, తదితరులున్నారు. ఆ బృందానికి అటవీ అధికారులతో పాటు, పోలీసులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.








