
- వైభవంగా ఎల్లమ్మ తల్లికి గౌడ కులస్థుల బోనాలు..
- దశాబ్దాల కల నెరవేరడంతో జోష్ లో గౌడన్నలు..
చిగురుమామిడి జన సముద్రం న్యూస్ జూన్ 4:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో నిర్మించిన శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ పునప్రతిష్ట సందర్బంగా వారంరోజులుగా గ్రామంలో పండుగ వాతావరణం కొనసాగుతుంది.ఎల్లమ్మ తల్లి విగ్రహ పున ప్రతిష్ట,పోచమ్మ బోనాలు,ఎల్లమ్మ తల్లి బోనాలు తదితర పూజ కార్యక్రమలను గౌడ కులస్థులు వైభవంగా నిర్వహిస్తున్నారు.మంగళవారం ఎల్లమ్మ బోనాలు,ఘట్టం తీయుట,4న ఎల్లమ్మ తల్లి కళ్యాణంను శ్రీరామక శ్రీనివాస్ శర్మ చేతుల మీదుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.వివిధ రకాల వేషధారణలతో డప్పు చప్పుళ్లు శివసత్తుల పూనకాల మధ్య ఎల్లమ్మ తల్లికి బోనాలను గౌడ కులస్థులు ఫుల్ జోష్ లో తీసుకెళ్లారు.చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతరను విజయవంతం చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారని గౌడ సంఘ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర తిరుపతి గౌడ్,ఉపాధ్యక్షులు గుడాల సంపత్ గౌడ్,గౌరవ అధ్యక్షుడు పైడిపల్లి మల్లేశం గౌడ్,నారగోని శ్రీనివాస్, బుర్ర సదానందం,పైడిపల్లి కుమార్,పైడిపల్లి రాములు, కొమ్మరే లక్ష్మయ్య,జాగిరి కుమార్, పైడిపల్లి వెంకన్న,తోడేటి శ్రీనివాస్,పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్,మార్క రాజ్ కుమార్ గౌడ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.