
జన సముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం మే 20 మెదక్ జిల్లా
చిన్నశంకరంపేట మండల పరిధి గజగట్లపల్లి గ్రామానికి చెందిన జనం సాక్షి రిపోర్టర్ గిరుకాల యాదగిరి తల్లి దుర్గమ్మ రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన బండారు సిద్ధిరాములు , బండారు సురేష్,అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఇటీవల ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సోమవారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పట్లూరి రాజు, మాజీ సర్పంచ్ మీనా రవీందర్, మండల బిఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.