
కామేపల్లి జనసముద్రం:
మండలంలోని
సాతానిగూడెంలో
గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కు కరెంట్ కష్టాలు తీరాయి. ఎక్కువ లోడు కారణంగా కామేపల్లిమండలంలోని సాతానిగూడెంలో నిత్యం కరెంట్ కోతలు ఏర్పడుతుండగా.. విషయాన్ని స్థానికులు కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కొమరం కనకయ్య గారు దృష్టికి తీసుకె ళ్లారు. వెంటనే స్పందించి ఆయన.. అదనంగా గ్రామంలో మరో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.వెంటనే స్పందించిన అధికారులు సాతానిగూడెంలో అదనంగా ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కరెంటు కష్టాలు తీరాయి. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోరిన వెంటనే అధికారులతో మాట్లాడి తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే కొమరం కనకయ్య గారుకి డబుల్ బెడ్ రూమ్ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యలమద్ది నరసింహారావు, కేసర నరసింహారెడ్డి మామిడాల వెంకయ్య, సండ్ర వెంకటేశ్వర్లు, సత్తి చిన్న వీరబాబు, బాదావత్ బాబు. మావిడా విజయకుమార్, మోహన్ రావు, వెంకట నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.