
జనసముద్రం న్యూస్ కుకునూర్:ఏప్రిల్ 30
29.04. 20 25వ తేదీ డిప్యూటీ
కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ మరియు అసిస్టెంట్ కమీషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ , ఏలూరు వారి సంయుక్త ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలో గల కుకునూరు మండలంలో శ్రీధరావేలేరు గ్రామము లో సారాయి తయారీ కి సిద్ధముగా వున్న 1200లీటర్లు పులిసిన బెల్లపు ఊట ను ధ్వంసం చేసినమని మరియు 15 లీటర్లు సారాయి ని స్వాధీనం చేసుకుని 1.జాటోత్తు నాగేష్, 2.వంకుడోతూ సాయి కిరణ్, 3.దరువాత్తు రాము అనే ముగ్గురు వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి జంగారెడ్డిగూడెం కోర్ట్ నందు హాజరు పరుచగా, రిమాండ్ విధించారు.ఈ దాడులో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ శ్యామ్ బోగేశ్వరరావు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు అని జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే శ్రీను బాబు తెలియజేశారు.