

పల్నాడు బ్యూరో జనసముద్రం న్యూస్, ఏప్రిల్ 26.
శుక్రవారం ఉదయం పలనాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు కారంపూడి వద్ద మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలకు అవసరమైన మౌలిక వసతులు మరియు వైద్య సదుపాయం ఉంచారా లేదా అడిగి తెలుసుకున్నారు. లేబర్ మొబైల్ జేషన్ జాగ్రత్తగా చేయాలన్నారు. ఫిబ్రవరి-2025 వరకు వేతనాలు అందాయా లేదా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్చి నెలకు సంబంధించి నిధులు రెండు మూడు రోజులు లో ఇవ్వడం జరుగుతుందన్నారు. సోమవారం నాటికి ఫారం ఫాoడ్స్ ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ ప్రారంభించాలని లేనిచో వారి పైన మరియు సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం పశువులకు ఎండ తీవ్రత దృష్ట్యా దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టెలను పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేశారు. నీటి తొట్ల ఏర్పాటులో ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఏర్పాటు చేయాలని ఎటువంటి వక్రీకరణలు ఆమోదించబడమన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి మురళీకృష్ణ, పిడి డ్వామా సిద్ధి లింగమూర్తి మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.