
జనసముద్రం న్యూస్,మార్చి.4,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :
దమ్మపేట మండలం గొల్లగూడెం గ్రామంలో భూమి వివాదం వలన ఇరువర్గాలు మధ్య గొడవ జరిగింది. ఆ గ్రామానికి చెందిన ముత్తారవు.దుర్గయ్య. వెంకన్న. సంజీవరావు. పుల్లారావు అనే అన్నదమ్ములకు సుమారు 6 ఎకరాల భూమి ఉంది. వారి భూమి పంపకాల నేపథ్యంలో చెలరేగిన గొడవ దాడికి దారి తీసింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు కత్తులతో దాడి చేసుకోగా ఐదుగురకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని దమ్మపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.