లక్కిరెడ్డి పల్లె రిపోర్టర్ రాయచోటి నియోజకవర్గం జనసముద్రం న్యూస్ నవంబర్ 3
లక్కిరెడ్డిపల్లి మండలం పాలెం గ్రామంలో ఉన్న చంచోలపల్లి గొల్లపల్లి,చిన్న పోతులపల్లి, బురుజు పల్లి, తదితర పల్లెలో చరవానిలు పనిచేయక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, రైతులు, విద్యార్థులు అన్ని రంగాల వారు మాకు సెల్ టవర్ వేయండి మహా ప్రబో అని అధికారులను సెల్ టవర్ యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు ఆ ఊర్లలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ ఏ సెల్ టవర్ సిగ్నల్స్ తగలక ఏవైనా తొందరగా జరిగే కార్యక్రమాల కోసం బంధువులను, శ్రేయోభిలాషులను,స్నేహితులను ఆహ్వానించాలనుకున్న సెల్ పని చేయకపోవడంవలన వారికి ఫోన్ చేయాలంటే వీలు పడడం లేదని తెలియజేస్తున్నారు తప్పనిసరిగా మాట్లాడాలనుకుంటే దూరంగా ఉన్న కొండెక్కి గాని, లేదంటే కోణంపేట పరిసర ప్రాంతాల్లోకి వచ్చి మేము ఫోన్ చేయాల్సి వస్తోందని వాపోతున్నారు ముఖ్యంగా ఆ పల్లెల్లో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు మా అమ్మా నాన్నను బంధువులను తోడబుట్టిన వారిని చూడడం కోసం ఇంటికి పోలేని పరిస్థితిలో ఉన్నామని తెలియజేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు, సెల్ టవర్ యజమానులు బిఎస్ఎన్ఎల్ గాని, ఎయిర్టెల్ గాని, వోడాఫోన్ గాని, ఎదో ఒక టవర్ వెయ్యాలని కోరుకుంటున్నారు