భూ సమస్యపై స్పందించని ధర్మారం మండల రెవెన్యూ అధికారులు
జనసముద్రం న్యూస్ : అక్టోబర్30 (పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్)
పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన న్యాతరి రామయ్య తన భార్య పేరు మీదుగా మల్లాపూర్ గ్రామంలో సర్వే.నెం.245/1/1 లో 1.0600( ఎకరం ఆరు గుంటలు) ప్రభుత్వ భూమి ఉందని అట్టి భూమిని వారు సాగు చేసుకుంటున్నారని పట్టా పాసు పుస్తకం , భూమి యజమాన్య హక్కు పత్రం తన భార్య పేరునే ఉన్నాయని ప్రస్తుతం ధర్మారం మండల కేంద్రంలో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంకులో వారి భార్య పేరును కొత్త(పంట రుణం) క్రాప్ లోన్ కు దరఖాస్తు చేసుకోగా వారి భూమి ఎకరం ఆరుగంటల భూమికి బదులు బ్యాంకు వారి వెబ్సైట్లో 8 గుంటలు మాత్రమే చూపిస్తుందని ఆ కారణంగా తనకు లోన్ రాదని బ్యాంకు సిబ్బంది , మేనేజర్ చెప్తున్నారని ఈ విషయంపై వారు మండలం తాహసిల్దార్ కి తేదీ: 24 సెప్టెంబర్ 2024 రోజున ఫిర్యాదు చేసి మా భూ సమస్యను పరిష్కరించమని కోరారు. కానీ వారు ఇచ్చిన ఫిర్యాదు పై 34 రోజులు గడిచిన ఎలాంటి విచారణ ఎమ్మార్వో ఎండి అరిఫుద్దీన్ , ఆర్ఐఓ వరలక్ష్మి చేయలేదని ఈ ఇద్దరు అధికారులు కారణంగా తాను కొత్త క్రాప్ లోన్ పొందలేక పోవుచున్నానని తేదీ: 28 అక్టోబర్ 2024 సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమంలో తన గోడును కలెక్టర్ కోయ శ్రీ హర్ష కి ఫిర్యాదు దరఖాస్తు రూపంలో చెప్పుకున్నారు. ఈ సందర్భంగా న్యాతరి రామయ్య మాట్లాడుతూ ధర్మారం మండల తాహసిల్దార్ కార్యాలయం చుట్టూ నెల రోజుల నుంచి తిరుగుతున్న తన భూ సమస్యకు పరిష్కారం చూపించడం లేదని ధర్మారం మండల తాహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదులపై నెలలు గడుస్తున్నా భూ సమస్యలకు పరిష్కారం చూపించడం లేదని, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష , అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ , పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య నిరంతరం జిల్లాలోని తాహసిల్దార్ కార్యాలయాల్లో పెండింగ్ భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రజావాణి కార్యక్రమాల్లోనే కాకుండా జిల్లాలో నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేస్తున్న క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న ధర్మారం మండలంలో మాత్రం భూ సమస్యల పై ఎమ్మార్వో , ఆర్ఐవోలు స్పందించడం లేదని తన ఆవేదనను వ్యక్తం చేశారు.