జన సముద్రం న్యూస్,30అక్టోబర్,పుట్లూరు.
మాదిగ ఉద్యోగుల సమాఖ్య ( ఎంఈఎఫ్) శింగనమల నియోజకవర్గ అధ్యక్షునిగా గుర్రం జయచంద్రను రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి బిక్షాలు సూచన మేరకు ఎన్నుకున్నట్లు జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ తెలియజేశారు. పుట్లూరు మండలం అరకట వేముల గ్రామానికి చెందిన జయచంద్ర పుట్లూరు మండలంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్న పోరాటాల్లో తరచూ పాల్గొంటున్నారని, అతన్ని ఆసక్తిని గుర్తించి నియోజకవర్గ అధ్యక్షులుగా నియమించినట్లు బండారు శంకర్ తెలిపారు. గుర్రం జయచంద్ర స్పందిస్తూ తనపై పెట్టిన బాధ్యతకు అనుగుణంగా కష్టపడి పని చేస్తానని, మాదిగ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, ఎంఈఎఫ్ జాతీయ, రాష్ట్ర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ 5 న అనంతపురంలో జరుగు మాదిగల ఆత్మీయ సదస్సుకు మాదిగ ఉద్యోగులతోపాటు, కార్యకర్తలను కూడా తరలిస్తామని జయచంద్ర తెలిపారు
మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల
Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…