జనసముద్రం న్యూస్, అక్టోబర్ 30 అమరావతి.
డ్యూటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ బస్ మార్గ మధ్యలో రిపేర్ రావటం తో ప్రయాణికులకు బోర్ కొట్టకుండా ఉండేందుకు ‘దేవర’ సినిమా లోని పాటకు బస్సు ముందు డాన్స్ చేయడంతో ఆర్టీసీ డిఎం గారు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. విషయం తెలిసిన నారా లోకేష్ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సస్పెన్షన్ ఎత్తివేయించారు. దీంతో తిరిగి డ్రైవర్ని విధుల్లోకి తీసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు.