కొల్చారం మండలం జనసముద్రం న్యూస్ అక్టోబర్ 25
- కొల్చారం ఎస్ఐ ముహమ్మద్ గౌస్…
నిత్యం వాహనాల తో రద్దీ గా ఉండే నేషనల్ హైవే ప్రధాన రహదారిపై వరి ధాన్యం ఆరోబోయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని కొల్చారం ఎస్సై మహమ్మద్ గౌస్ అన్నారు.గురువారం నాడు కొల్చారం పోలీస్ స్టేషన్ లో ఎస్సై మహమ్మద్ గౌస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిత్యం ఏడుపాయల కు, అలాగే మెదక్ పట్టణంలోని చర్చి కి వీళ్ళేభక్త్తుల తో కొల్చారం రహదారి వాహనాల రాకపోకల తో బిజీ గా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభం అయిన నేపధ్యంలో రోడ్ల పైన ధాన్యం రసులను ఆరోబోయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. అలాగే ధాన్యం రసుల పై నల్ల కలర్ టాపర్ లు కప్పడం ద్వారా రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రమాదాల నివారణకు రైతులు సహకరించాలని అన్నారు.