జనసముద్రం అక్టోబర్ 25 బ్యూరో చీప్ టిజి &ఎపీ
శ్రీరాముడు జన్మించిన అయోధ్య మొదలు భక్త రామదాసు నిర్మించిన భద్రాచలం రాముని ( ఆస్తులు) భూములు అపహరించడానికి అందరికల్లు శ్రీరాముని ఆస్తులపైనే ఉంటాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో శ్రీరాముని గుడులు అధికంగానే ఉంటాయి. రామ భక్తులైన దాతలు రామాల యాల నిర్వహణ కోసం భూములు మరియు ఇతర రూపాలలో రామాలయాలకు దానంగా ఇస్తుంటారు. రాముని పై భక్తి గల దాతలు ఉన్నట్లే రామాలయ భూములు అక్రమ పద్ధతులను స్వాధీనం చేసుకునే అక్రమార్కులు కూడా అధికంగానే కనిపిస్తుంటారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి హక్కుభుక్తంలో ఉన్న సుమారు ఒక వెయ్యి ఎకరాలకు పైగా భూములు ఇతరుల స్వాధీనంలోనే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ లో వేం చేసియున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారికి చెందిన వందలాది ఎకరాల భూమి న్యాయవిరుద్ధంగా అన్యాక్రాంతమైనట్లు తెలుస్తున్నది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థా నానికి చెందిన భూముల పై సర్వహక్కులు రామాల యానికే ఉన్నాయని ఆ భూములు భద్రాచలం రామాలయానికే చెందుతాయని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అనేకమార్లు తీర్పులిచ్చినప్పటికీ, పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న ఈ భూములపై ఇప్పటికి వివాదాలను నడుస్తూ రామాలయానికి భూములపై తగు ఆదాయాలు రావడం లేదు. భద్రాచలం రామాలయం భూములపై ఈ మధ్యనే దేవస్థానం వారికి ఆక్రమణదారులకు రామాలయ భూముల వద్దని ఒకరిని ఒకరు నెట్టి వేసుకునే పరిస్థితులు రావడం కూడా జరిగింది.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ లోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవాలయం భూములు ఇతర అవసరాలకు ఉపయోగించరాదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయలు విలువ చేసేవందలాది ఎకరాలు హైకోర్టు ధర్మాసనం తీర్పుకు వ్యతిరేకంగా గత ప్రభుత్వ హయాంలో ఇతర సంస్థలకుకట్టబెట్టినట్లు తెలుస్తుంది. కోట్లాదిమంది భక్తులు ఆరాధించే దేవాలయాల భూములను కోర్టు తీర్పుల ప్రకారం దేవాలయాల భూములు ఆయా దేవస్థానాలకు చెందే విధంగా రెండు తెలుగు రాష్ట్రల ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.