జనసముద్రం న్యూస్,02అక్టోబర్,
:అనంతపురం. బాల్యవివాహాల నిర్మూలన కోసం నిర్మించిన బడి పిలుస్తోంది లఘు చిత్ర పోస్టర్లను అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్దాలు గడిచినా ఇంకా బాల్య వివాహ వ్యవస్థ రద్దు కాకపోవడానికి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని అన్నారు . బాలిక తల్లిదండ్రులలో అవగాహన పెరగాలంటే ఇలాంటి లఘు చిత్ర ప్రదర్శన ద్వారా సాధ్యమవుతుందని, ఇలాంటి లఘు చిత్రాలను ప్రోత్సహించాలని అన్నారు. ఈ సందర్భంగా లఘు చిత్ర యూనిట్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు తరిమెల రాజు, నటులు కేపీ రాజు ,సాకే సుధాకర్ ,మనోహర్ ,శంకర్ రెడ్డి ,సుధాకర్ రాజు ,ప్రశాంత్ ఎస్సీ ఎస్టీ మోనిటరింగ్ కమిటీ నాయకులు ఇమామ్ ,ఎస్ ఆర్ ఎడ్యుకేషనల్ సోసైటీ వ్యవస్థాపకులు సుంకర రమేష్, తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు టివి రెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కే. అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు