ఇంకెన్నాళ్లి ఈ అజిలాపూర్,బైరాపురం రోడ్ల దుస్థితి
ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ! ఈ రోడ్డు పరిస్థితి మారడం లేదు..?
వెల్డండ,సెప్టెంబర్,28(జనసముద్రం న్యూస్)
వెల్డండ మండల పరిధిలో బైలాపూర్ నుండి అజిలాపూర్ గ్రామానికి వెళ్లేందుకు ఉన్న మట్టి రోడ్డు అస్తవ్యస్తంగా గుంతలు పడి ఉండడంతో రోడ్డుపై ప్రయాణించాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు ప్రయాణికులు అంటున్నారు.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై గుంతలలో నీరు చేరి రోడ్డు బురదగా మారడంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు, దీనిని అధికారులు గానీ.! ప్రజా ప్రతినిధులు గాని.! ఎవరు కూడా పట్టించుకోవడంలేదని గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి పాలకులు వస్తున్నారు పోతున్నారు కానీ! ఈ రోడ్డును పట్టించుకున్న నాధుడే లేరని వారు వాపోతున్నారు,దీనిపై సంబంధిత అధికారులు అదేవిధంగా నియోజకవర్గ శాసనసభ్యులు దీనిపైన వెంటనే స్పందించి సరైన రోడ్డు నిర్మాణం చేసి వారి ఇక్కట్లు తొలగించాలని పరిసర గ్రామ ప్రజలు ప్రయాణికులు కోరుకుంటున్నారు..