జనసముద్రం సెప్టెంబర్ 24:
ధర్మవరం పట్టణంలోని బిజెపి నాయకులు భోజనం చేసుకుని సబ్ జైల్ దగ్గర వస్తున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు బిజెపి నాయకుల కారుకు అడ్డు ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడి కూటమి కార్యకర్తలైన రమేష్ రెడ్డి,ప్రతాపరెడ్డి లను కారుతో అతి దారుణంగా గుద్ది అక్కడినుండి వెళ్లిపోయారని బిజెపి నాయకుల మీద రౌడీయిజం చేసి వారిని చంపాలని చూస్తున్నారని కేతిరెడ్డి ఓడిపోయినా కానీ ఇటువంటి హత్య రాజకీయాలు అదేపనిగా చేయాలని చూస్తున్నాడని ఇతనిని వెంటనే ధర్మవరం నుండి బహిష్కరణ చేయాలని ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలియజేసి కేతిరెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ధర్మవరం పట్టణంలో తిరగలేవని హెచ్చరించి అదేవిధంగా కూటమి నాయకులు,కార్యకర్తల పైన ఈగ వాలిన చూస్తూ ఊరుకోమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.