సెప్టెంబర్ 15(జనసముద్రంన్యూస్ చింతపల్లి)
చింతపల్లి మండలం కిష్టరాయినిపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్బంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలోఒక యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందగా ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది….శనివారం పండుగ ఉత్సహంలో ఉన్న ఆ యువకుడు గణేష్ మండపంలో లైట్ బిగిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు … కిష్టరాయినిపల్లి గ్రామానికి చెందిన
కారింగ్ రామచంద్రం -లక్ష్మమ్మ పెద్ద కుమారుడు కారింగ్ వర్ధన్ గౌడ్ (21) హైదరాబాద్ లో బి టెక్ చదువుతు సెలవుల నిమిత్తం గ్రామానికి వచ్చాడు వినాయక చవితి సందర్భంగా గ్రామంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి…కుటుంబంలో తీరని విషాదం నింపింది. తమ కళ్ళముందే యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…