మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ 15
రాచకొండ కమిషనర్ జి .సుధీర్ బాబు. ఐపిఎస్ అంబర్ పేట లోని సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ లో కొత్తగా నిర్మించిన కంట్రోల్ రూమ్, ఉమెన్ గార్డ్ రూమ్ లను మరియు సెల్యుటింగ్ బేస్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ మాట్లాడుతూ, రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో ఏఆర్ విభాగం ఎంతో సమర్థవంతంగా, సాహసోపేతంగా సంగవిద్రోహ శక్తులను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తొందని పేర్కొన్నారు. ఎన్నో సమస్యాత్మక పరిస్థితుల్లో ఘర్షణల నివారణలో, పండుగల బందోబస్తు, ఎన్నికల బందోబస్తు నిర్వహణ, గణేష్ నిమజ్జనం ఊరేగింపు వంటి విధుల నిర్వహణలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల కృషి ఎంతో ఉందని అభినందించారు. భవిష్యత్తులో కూడా వారి సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్స్ మరియు విభాగాల డి సి పి అధికారులు మరియు ఏ. ఆర్. అడిషన్ డి సి పి లు శ్రీ. శ్యామ్ సుందర్, వెంకటరెడ్డి, వినోద్ కుమార్ మరియు ఏసీపీ లు శ్రీ.ఇమ్మానువల్, మహేశ్వర్,శైలేష్,సురేష్, మరియు ఆర్ఐ లు ఆర్ఎస్ఐ లు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.