సెప్టెంబర్ 17,న ఘనంగా ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 14:
మహబూబాబాద్ జిల్లా లో
శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గణేష్ నిమజ్జనం, ప్రజా పాలన దినోత్సవం ఏర్పాట్లపై అదనపు కలెక్టర్లు రెవెన్యూ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, డేవిడ్, అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, లతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహబూబాబాద్ పట్టణంలో నిజాం చెరువు, తొర్రూరులో పెద్ద చెరువు, మరిపడలో మాకుల చెరువు, డోర్నకల్ బతుకమ్మ చెరువు, అలాగే గ్రామపంచాయతీ పరిధిలో సూచించిన చెరువులలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరిగిందని, శానిటేషన్, త్రాగునీరు, విద్యుత్, సౌకర్యం, గజఈతగాళ్లను, లైఫ్ జాకెట్ లను, సిద్ధం చేసుకోవాలన్నారు.
గణేష్ మండపాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, విద్యుత్ ప్రమాదాలు, తదితర విషయాలపై స్థానిక గణేష్ ఉత్సవ కమిటీలు, పోలీస్ రెవెన్యూ మున్సిపల్ గ్రామపంచాయతీ సిబ్బందిలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఊరేగింపు జరిగే దారులను ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని చెరువుల వద్ద భారీ కేడ్స్, నిర్మించాలని, ట్రాఫిక్ రూట్ మ్యాపు ప్రకారం నిమజ్జనం నిర్వహించాలని సూచించారు,
మండపాల వద్ద నిమజ్జనం జరిగే ప్రదేశాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
నిమజ్జనంపై ప్రత్యేక బృందాలను షిఫ్టులవారీగా నియమించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
సూచించబడిన చెరువులలో మాత్రమే నిమజ్జనం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో వాగులలో నిమజ్జనం చేయకూడదని సూచించారు.
సెప్టెంబర్ 17,ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉండాలన్నారు.
ప్రభుత్వం సూచించిన ప్రకారం ముఖ్య అతిథి చేత జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుందని,
అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాలు ఎగరవేయాలని, ఆరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, వేడుకలకు వచ్చే అతిధులు,మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రోటోకాల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు పక్కా ప్రణాళికతో నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో తొర్రూర్ ఆర్డీవో నరసింహారావు, ఎన్పీడీసీఎల్, జడ్పీ సీఈఓ నర్మదా, ఈఈ ఆర్ అండ్ బి, ఐ బి, భీమ్లా నాయక్, సమ్మిరెడ్డి, డిపిఓ హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్లు, ఎక్సైజ్ ఫైర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, సూపర్డెంట్ మదన్ మోహన్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.