జనసముద్రం న్యూస్ జూన్ 7:
ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ కి ఈసారి సొంత సామాజికవర్గం నుంచే ఎదురు దెబ్బ తగిలేలా ఉంది అని అంటున్నారు. జగన్ సామాజిక న్యాయం అనుకుంటూ 2019 నెల్లూరు ప్రకాశం చిత్తూరు వంటి జిల్లాలలో ప్రయోగాలు చేశారు. అయితే జగన్ వేవ్ నాడు బలంగా ఉండడంతో పాటు జగన్ని ఒక్కసారి అయినా సీఎం గా చూడాలన్న ఆలోచనతోనే అంతా కలసి పనిచేశారు గెలిపించారు.
కానీ ఈసారి అలా కాదు అంటున్నారు. ప్రత్యేకించి రెడ్డి సామాజికవర్గం నుంచే గట్టిగానే సూచనలు వైసీపీకి వస్తున్నాయని అంటున్నారు. సంప్రదాయం ప్రకారం కొన్ని దశాబ్దాలుగా రెడ్డీస్ కి కేటాయిస్తూ వస్తున్న సీట్లలో వారికే 2024 ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని అంతా కోరుతున్నారు. అలా కాకుండా మళ్లీ ప్రయోగాలు చేస్తమంటే ఊరుకోమని సున్నితంగా హెచ్చరిస్తున్నారు అంటున్నారు.ఆ విధంగా చూస్తే నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇచ్చారు. ఈసారి అక్కడ నుంచి రెడ్డీస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో దర్శి కనిగిరి గిద్దలూరు వంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయంగా గట్తి బలం ఉన్న రెడ్లను పక్కన పెట్టేశారు అన్న ఆవేదన వారిలో ఉంది అంటున్నారు. ఆయా సీట్లను వేరే వారికి ఇచ్చారని కూడా పేర్కొంటున్నారు.
ఇక చిత్తూరు జిల్లాలో చాలా సీట్లలో ఇదే రకమైన పరిస్థితి ఉందని అంటున్నారు. ఇలా టికెట్లు ఇస్తే తాము గెలిపిస్తూ వచ్చామని అయితే గెలిచి ఎమ్మెల్యేలు అయిన వారంతా రెడ్లను తెగ ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోతున్నారు. తమ మాట ఏ మాత్రం చెల్లకపోగా కష్టపడి గెలిపించిన పాపానికి తామేబ్యాక్ బెంచీలకు పరిమితం అవుతున్నామని కూడా మండిపోతున్నారు.చాలా మంది ఎమ్మెల్యేలు అయితే గెలిచిన తరువాత తమ వెనక ఉన్నది ఎవరు అండగా నిలిచింది ఎవరూ అన్నది కూడా పూర్తిగా మరచిపోయి సొంత రాజకీయం మొదలెట్టేశారని పైగా రెడ్డీస్ నే కీలకమైన చోట్ల దెబ్బేసేలా రాజకీయం చేస్తూంటే మిన్నకుండాలా అని వారి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే ముందుగానే చెప్పెస్తున్నారుట. ఇంతటితో చాలు మహా ప్రభో. ఈసారి టికెట్లు ఇచ్చేటపుడు కొన్ని నియోజకవర్గాలలో అక్కడ బలాలను బలగాలను కూడా బేరీజు వేసుకోవాలని సూచిస్తున్నారుట.
లేకపోతే మాత్రం ఎలాంటి మొహమాటాలు పేచీ పూచీలు ఉండవని తాము ఓటు వేయమంటే వేయమని అల్టిమేటం జారీ చేస్తున్నారుట. ఇపుడు ఇది నిజంగా వైసీపీకి ఒక అగ్ని పరీక్షంగానే చూడాలి. సొంత సామాజికవర్గం లో సెగలను పొగలను ఆర్పుతూనే తాము ముందుకు సాగాల్సి ఉంది. మొత్తానికి తాంబూలాలు ఇచ్చేశామని గ్రేటర్ రాయలసీమలఒని కీల్క జిల్లాల రెడ్డీస్ అంటున్నారు. ఇక బంతి వైసీపీ కోర్టులో ఉంది. ఏమి డెసిషన్ తీసుకుంటారో వారిష్టం అంటున్నారు.