జనసముద్రం న్యూస్, జూన్ 05 :
దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఐదో ఏడాది కూడా మొదటిస్థానం సంపాదించింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) జాబితాను ప్రకటించారు.
మొత్తంగా విద్యాసంస్థల జాబితాలో.. ఐఐటీ మద్రాస్ మొదటిస్థానంలో ఉండగా ఐఐఎస్సీ బెంగళూరు రెండు ఐఐటీ దిల్లీ మూడో స్థానంలో ఉన్నాయి. విశ్వవిద్యాలయాలపరంగా.. ఐఐఎస్సీ బెంగళూరు దిల్లీలోని జేఎన్యూ జామియా మిలియా ఇస్లామియా మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. హైదరాబాద్లోని హెచ్సీయూ పదో స్థానంలో నిలిచింది.ఆరో ఎడిషన్లో ఎనిమిది ఐఐటీలు రెండు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు దేశంలోని మొదటి పది ఇంజినీరింగ్ సంస్థల్లో చోటు దక్కించుకున్నాయి. టాప్ టెన్ జాబితాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ దేశంలోని జాతీయ విద్యాసంస్థల్లో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ఐఐఎస్సీ బెంగళూర్ రెండో స్థానంలో ఐఐటీ ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి.
ఐఐటీ బాంబే ఐఐటీ కాన్పూర్ ఐఐటీ ఖరగ్పూర్ ఐఐటీ రూర్కీ ఐఐటీ గువాహటి ఐఐటీ హైదరాబాద్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీలోని జేఎన్యూ తొమ్మిది బెనారస్ హిందూ యూరివర్సిటీ పదో ర్యాంకు సాధించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) అహ్మదాబాద్ ఉత్తమ బీ-స్కూల్గా నిలిచింది. అయితే ఫార్మసీలో హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి స్థానంలో నిలిచింది. జామియా హమ్దర్ద్ బిట్స్ పిలానీ రెండో మూడో స్థానాలు సాధించాయి.
కళాశాలల కేటగిరిలో దిల్లీలోని మిరాండా హౌస్ హిందూ కాలేజ్ చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాలలు తొలి మూడు స్థానాలు సాధించాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం.. ఎయిమ్స్ ఢిల్లీ వైద్య కళాశాలల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. పీజీఐఎంఈఆర్ చండీగఢ్ వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.ఐఐఎస్ సీ బెంగళూర్ పరిశోధనకు ఉత్తమమైన సంస్థగా ఐఐటీ కాన్పూర్ ఆవిష్కరణలకు ఉత్తమ ర్యాంక్ ను పొందాయి. మేనేజ్మెంట్ కాలేజీల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) అహ్మదాబాద్ అగ్రస్థానంలో ఉండగా ఐఐఎం బెంగళూరు ఐఐఎం కోజికోడ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. విద్యాసంస్థల్లో అందిస్తోన్న విద్యాబోధన కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా 2016 నుంచి ఈ ర్యాంకులను కేంద్రం ప్రకటిస్తోంది.