
జనసముద్రం న్యూస్,రాప్తాడు,,జనవరి 13:

రాప్తాడు మండలం యర్రగుంట గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ పద్మావతి 3నెలల కిందట అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ భీమాకి ధరకాస్తు చేసుకున్నారు. శుక్రవారం రాప్తాడు మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయం నందు ఎంపీపీ జయలక్ష్మి సత్యనారాయణ రెడ్డి మరియు ఎంపిడివో సాల్మన్ రాజ్ చేతుల మీదుగా పద్మావతి కుటుంబానికి చెందిన గుగ్గిళ్ళ నారాయణ రెడ్డికి రూ.ఒక లక్ష అందజేశారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ వైయస్సార్ భీమాతో మరణించిన వారి కుటుంబం కొంతవరకు ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడవచ్చని తెలియజేశారు.