

జన సముద్రం న్యూస్ : జనవరి 13
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మణుగూరు నందు జనవరి 18 న 2023 రెండవ విడత కంటి వెలుగు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పి ఎం ఓ ఎస్ , డి ఈ ఓ ఎస్ , సూపర్ వైజర్లు ఏఎన్ఎం మ్స్ మరియు ఆశా కార్యకర్తల కు కంటి వెలుగు పై అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్ చేయించడం జరిగింది. ప్రజా ప్రతినిధులకు , ప్రజలకు వారి వారి గ్రామాల్లో గానీ వార్డు వైస్ గా తేదీలను తెలియ చేస్తూ ఆహ్వాన పత్రికలు అంద చేయాలని, ఆశ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమంను విజయవంతo చేయాలని డాక్టర్.శివ సూచించారు. ఈ కార్యక్రమం లో డా.నిశాంత్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.