జనసముద్రం న్యూస్ , తుంగతుర్తి,జనవరి 9:
తుంగతుర్తి:- తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షుడిగా తొనుకునూరి అశోక్ గౌడ్ ని నియమిస్తూ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చిత్తలూరి నారాయణ గౌడ్ చేతుల మీదుగా సోమవారం నియామాక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ నిత్యం గౌడ కులస్తుల సంక్షేమం కోసం పోరాడుతానని, తన ఎన్నికకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మండల అధ్యక్షుడిగా గుండగాని దుర్గయ్య గౌడ్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు బిక్కి బుచ్చయ్య గౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షలు చౌగాని శ్రీనివాస్ గౌడ్, అధికార ప్రతినిధి చౌగాని వెంకటేశ్వర్లు గౌడ్, నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ సున్నపు జలంధర్ గౌడ్, ఉపాధ్యక్షులు తండు మహేష్ గౌడ్, తుంగతుర్తి డివిజన్ ప్రధాన కార్యదర్శి గునగంటి శ్రీనివాస్ గౌడ్, గోపగాని వెంకన్న గౌడ్, గునిగంటి యాదగిరి గౌడ్, ప్రవీణ్, శ్రీహరి తదితరులుపాల్గొన్నారు