

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,కరకగూడెం మండలంలోని ముస్లింలు పండుగ సమయాల్లో నమాజ్ చదవడానికి ఈద్గాకు స్థలం కేటాయించి,మండల కేంద్రంలోని సర్వే నెంబర్239లో గల ఖబరస్తాన్(స్మశాన వాటిక)ఆక్రమణకు గురవుతున్నదని వెంటనే సర్వే చేయించాలని కోరుతూ కరకగూడెం కో-ఆప్షన్ సభ్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో శుక్రవారం కరకగూడెం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ సంధ్యా కు వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం సఫియా మస్జీద్ కమిటీ సదరు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్,కరకగూడెం జామా మస్జీద్ సదరు సయ్యద్ సజ్జాద్,మౌలానా ఫిరోజ్,షేక్ ఖళీల్ పాషా,యాకూబ్, ఇసహర్,ఖలీల్,అజ్జు,ఇలియజ్,గౌస్ పాషాషారుక్ తదితరులు పాల్గొన్నారు.