భారత్ లో పెరుగుతున్న గుండెపోటు మరణాలు..యువకులు,మధ్య వయస్కులు,స్త్రీ ల పై అధిక ప్రభావం

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 :

గుండెపోటుతో మరణించారనే వార్త ఒకప్పుడు చాలా అరుదుగా వినిపించేది. అది కూడా ముసలితనంలో ఉన్నవారిలో కన్పించేది. కానీ ఇప్పుడు మాత్రం గుండెపోటు అనే మాట ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట వినాల్సి వస్తుంది. అది కూడా చిన్న.. పెద్ద అని తేడా లేకుండా వస్తుండటం ప్రతి ఒక్కరినీ కలవరపాటుకు గురి చేస్తోంది.

ఇటీవల కాలంలో భారత్ లో గుండెపోటు మరణాలు.. స్ట్రోక్ కు గురవుతున్న వారి సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిపోయిందని లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది. 357 జిల్లాలకు చెందిన 32 వేల మంది ప్రజల అభిప్రాయాన్ని సేకరించి నివేదికను తయారు చేశారు. ఈ సర్వే ప్రకారం.. తమ పరిచయస్తుల్లో ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ కోవిడ్ బారిన పడిన వారు 61శాతం ఉన్నారని చెప్పారు.

28 శాతం మంది తీవ్రంగా వైద్య పరిస్థితులు అనుభవించినప్పటికీ కోవిడ్ బారిన పడలేదని వెల్లడించారు.  62 శాతం మంది రెండు సార్లు టీకాలు వేయించుకున్నట్లు చెప్పారు. 11 శాతం మంది ఒకే డోస్ టీకాలు తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే 8 శాతం మంది టీకాలు వేసుకోలేదని తెలిపారు.గుండెపోటుకు గురైన వారిలో టీకాలు వేయించుకున్న వారితో పాటు వేయించుకోని వారు సైతం  ప్రభావితమైనట్లు సర్వేలో వెల్లడైంది. సుమారు 51 శాతం మంది పౌరులు గత రెండేళ్లలో తమ సన్నిహితులు ఒకరు లేదా అంత కంటే ఎక్కువ మంది గుండెపోటు లేదా మెదడు స్టోక్.. రక్తం గడ్డకట్టడం.. నరాల సంబంధిత సమస్యలు.. క్యాన్సర్ సంబంధిత వ్యాధితో.. ఆకస్మిక పరిస్థితులకు గురైనట్లు వెల్లడించారు.

ఆరోగ్యవంతమైన యువకులు.. మధ్య వయస్సు గలవారు.. పురుషులు.. స్త్రీలు అనేక మంది మరణించినట్లు వెల్లడించారు. గత మూడు నెలల కాలంలో ఈ ఆకస్మిక మరణాలు ఎక్కువగా నమోదైనట్లు పేర్కొన్నారు. జిమ్.. డాన్స్ చేసేటప్పుడు.. నడక వంటి శారీరక శ్రమలో నిమగ్నమైన సమయంలో గుండెపోటుకు గురయ్యారని వెల్లడించారు.

ఈ సమయంలో వారంతా ఆందోళనకు గురి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. అయితే కోవిడ్ టీకాలు వేయించుకున్న వారికి.. టీకాలు వేయించుకోని వారికి గుండెపోటు సంబంధిత విషయాల్లో పెద్దగా తేడా ఏమీ లేదని సర్వేలో వెల్లడైంది. అయితే టీకాలు తీసుకున్న వారు గుండెపోటుకు గురై నప్పటికీ ఎక్కువగా కోలుకున్నారని తేలింది.

తీవ్రమైన కోవిడ్ కు గురై ఆస్పత్రిలో చేరిన వారిలో 20 శాతం నుంచి 30 శాతం వరకు ట్రోపోనిన్ స్థాయిలు పెరగడం.. సిరల థ్రోంబో ఎంబోలిజం.. గుండెపోటు.. అరిథ్మియాల ద్వారా మయోకార్డియల్ ప్రమేయం ఉన్నట్లు రుజువు ఉందని ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి.

కోవిడ్ లేదా దాని సంబంధిత వ్యాధుల సమస్యలను సాధ్యమైనంత వరకు తగ్గించేలా కోవిడ్ రీఇన్ఫెక్షన్లను నివారించాల్సిన అవసరం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సర్వేలో వెల్లడైన విషయాలను లోకల్ సర్కిల్ త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ వివరాలను పరిశీలించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

  • Related Posts

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    Spread the love

    Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!