

✍️ నేడు మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా బ్రహ్మసముద్రం మండలం సంతేకొండాపురం గ్రామంలోని సావిత్రి బాయి పూలే గారి కాలనీలో మహాత్మా జ్యోతిరావుపూలే గారి చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారు.
ఈ సందర్భంగా మంత్రి ఉషాశ్రీచరణ్ గారు మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాలు, అణగారిన ప్రజల హక్కుల సాధన కోసం జ్యోతిరావు పూలే గారు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. మహిళల విద్యావికాసానికి, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. సమసమాజ స్థాపనకు బాటలు వేసిన పూలే గారి ఆశయాలే స్ఫూర్తిగా మనందరం ముందుకు సాగుదామని తెలియజేశారు.