శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి

Spread the love

జనసముద్రం న్యూస్,రాప్తాడు :

రాప్తాడు పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లోని తాజా పరిస్థితులపై ఆరా తీశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల కట్టడికి కృషి చేయాలి. తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఇతర విభాగాలతో కలసి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు చేపట్టి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన చేయాలన్నారు. క్రైం అగనెస్ట్ ఉమెన్, ఎస్సీ ఎస్టీల నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. గ్రామాల్లో సిసి కెమేరాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. ప్రజల్లో మమేకమయ్యేలా పోలీసుల పని తీరు ఉండాలని సూచించారు. గ్రామ పోలీసులను సమన్వయం చేసుకుని నేరాలు తీవ్రం కాకుండా మొగ్గ దశలోనే అణచి వేయాలన్నారు. పోలీసు స్టేషన్ సిబ్బందితో ముఖాముఖి సమావేశమయ్యారు. సిబ్బంది సాధక బాధకాలను అడిగి తెలుసుకోవడంతో పాటు పోలీసు విధుల పట్ల దిశానిర్ధేశం చేశారు. జిల్లా ఎస్పీతో పాటు ఇటుకలపల్లి సి.ఐ మోహన్, రాప్తాడు ఎస్సై రాఘవరెడ్ది, తదితరులు తనిఖీలో పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్