రాప్తాడు,( జన సముద్రం న్యూస్):
గంగపూజ చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి .
పుష్కలంగా వానలు కురవడంతో పార్టీలకు అతీతంగా రైతులు ప్రశాంతంగా ఉన్నారు.
40 ఏళ్లుగా నిండని రాప్తాడు మండలం చెర్లోపల్లి చెరువు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు మరవ పారడంతో రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం చెర్లోపల్లి చెరువులో గంగపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…దాదాపు 280 ఎకరాలు మునక ఉన్న పెద్ద చెరువు ఇది. ఇలాంటి చెరువు నిండి మరవ పారుతోందంటే వానలు పుష్కలంగా ఉన్నాయని రైతులు ఆనందంగా చెబుతున్నారు. ఇదేకదా రాజన్న రాజ్యం అంటున్నారు. ప్రతి చెరువుకూ నీళ్లొస్తున్నాయి, ప్రతి కాలువా నీళ్లు పారుతున్నాయి. ప్రతి రైతు కళ్లల్లోనూ ఆనందం కనిపిస్తోంది. జగనన్న రాజ్యంతో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు. పేద అని అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎక్కడ కూడా చిన్నపొరబాటు లేకుండా తారతమ్య బేధం లేకుండా మంచి జరుగుతోంది.
పేరూరు డ్యాంలో పుష్కలంగా నీళ్లున్నాయి. 40 నెలల జగనన్న ప్రభుత్వ పాలనలో 30 నెలలు పాటు పీఏబీఆర్ కుడికాలవ, హంద్రీనీవా కాలువలు ప్రవహించాయి. ఇదే విధంగా భగవంతుడు మల్లీమళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలి. రైతులు సుభిక్షంగా ఉండాలి. రాప్తాడు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా రైతులంతా ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడా గొడవల్లేవ్, కార్పణ్యాల్లేవ్ రైతులు, రైతు కూలీలకు పుష్కలంగా పనులు ఉన్నాయి. ఇలాగా ఉండాలని ప్రజలు, రైతులు కోరుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు జూటూరు శేఖర్, ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి సత్యనారాయణ రెడ్డి, జడ్పీటీసీలు పసుపుల హేమావతి ఆది , వైస్ ఎంపీపీలు వరలక్ష్మి, ఎంపీటీసీలు రామచంద్ర రెడ్డి, బుడగ నాగరాజు, చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.