పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయిన చైనా రాకెట్ శకలాలు.. తప్పిన ప్రాణనష్టం

Spread the love

*వూపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు

జనసముద్రం న్యూస్,విశాఖపట్నం,నవంబర్5:

సైంటిస్టులు ఉత్కంఠగా ఎదురుచూసిన చైనా భారీ రాకెట్‌ పసిఫిక్‌ మహాసముద్రంలో సురక్షితంగా పడిపోయాయి. మహాసముద్రంలో శకలాలు పడడంతో ప్రాణనష్టం తప్పింది.దీంతో ప్రపంచదేశాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా స్పేస్ కమాండ్ ధ్రువీకరించింది. చైనాకు చెందిన ఓ భారీ రాకెట్‌ శకలాలు నియంత్రణ లేకుండా భూమిపై పడనున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పిన అంచనాలతో పలు దేశాల్లో భయాందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే.
స్పేస్‌లో న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌ నిర్మాణంలో భాగంగా చైనా గత సోమవారం చివరి మాడ్యూల్‌ను భూమి నుంచి పంపించింది. చైనా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన రాకెట్, లాంగ్ మార్చ్ 5బీ అక్టోబర్ 31న నింగిలోకి దూసుకెళ్లింది. 23 టన్నులు బరువున్న రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్షంలో చైనా నిర్మిస్తున్న స్పేస్‌ స్టేషన్‌కు 20 టన్నుల బరువున్న మెంగ్టియన్ లాబొరేటరీ క్యాబిన్ మాడ్యూల్‌ను దీని ద్వారా పంపారు. అయితే, ఈ రాకెట్‌ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 10 అంతస్తుల భవనమంతా పెద్దగా ఉండే ఈ వ్యోమనౌక భూ వాతావరణంలోకి చేరుకున్న తర్వాత కొంతభాగం కాలిపోయినప్పటికీ.. కొన్ని ప్రధాన భాగాలు అలాగే భూమిపై పడతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. శకలాలు ఎక్కడ పడతాయోనని పలు దేశాలు భయాందోళనకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో అవి సురక్షితంగా పసఫిక్‌ మహాసముద్రంలో పడ్డాయి.

Related Posts

అమెరికా జోక్యం..భారత్ విషయంలో ముసుగు తీసేసిందా…!?

Spread the love

Spread the loveఅమెరికాను ప్రపంచ పోలీస్ అని ముద్దుగా పిలుస్తారు. ఈ పోలీసు కి ఎక్కడ లేని విషయాలూ కావాలి. తనది కానిది కూడా తన సొంతమే అనుకునే వైఖరి అని తెల్ల దేశం మీద ఒక గట్టి భావన. తాము…

టెన్త్ అమ్మాయికి గంజాయి ఇచ్చి అత్యాచారం!

Spread the love

Spread the loveజగిత్యాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అమ్మాయిలే లక్ష్యంగా.. వారికి గంజాయి ఇచ్చి అలవాటు చేసి, అనంతరం వారిని బానిసలుగా చేసి, వారిని రేవ్ పార్టీలకు తీసుకెళ్తూ, వ్యభిచార కూపంలోకి లాగుతూ అనేక ఘోరాలకు పాల్పడుతున్న…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

చదువుల తల్లి, సంఘసంస్కర్త, భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు,

చదువుల తల్లి, సంఘసంస్కర్త, భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు,

ఏపీ ఎం డిసికి 1000 కోట్లు నష్టం..?? నాయకులకి వెయ్యి కోట్లు ఆదాయం…!!

ఏపీ ఎం డిసికి 1000 కోట్లు నష్టం..?? నాయకులకి వెయ్యి కోట్లు ఆదాయం…!!

జనసముద్రం న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన హుజురాబాద్ సిఐ

జనసముద్రం న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన హుజురాబాద్ సిఐ

అదుపుతప్పి లారీని ఢీకొన్న నాగార్జున పాల డైరీ వ్యాన్

అదుపుతప్పి లారీని ఢీకొన్న నాగార్జున పాల డైరీ వ్యాన్

ప్రైవేట్ ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు

ప్రైవేట్ ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు

జనసముద్రంన్యూస్ దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన వెల్దుర్తి ఎస్ఐ సమందర్ వలి.

జనసముద్రంన్యూస్ దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన వెల్దుర్తి ఎస్ఐ సమందర్ వలి.