
కామేపల్లి జనసముద్రం జూన్ 16:
విద్యుదాఘాతంతో మూడు పాడి ఆవులు మృతిచెందిన సంఘటన కామేపల్లి మండలం సాతానిగూడెం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతానా చోటుచేసుకుంది. గ్రామంలోని జవాజి నరసయ్య బాధితుడు, సత్తి గురవయ్య, మాలోత్ సామ్య, లకు వారి కథనం ప్రకారం.. గ్రా మ శివారులోని పొలంలో ప శువులు మేత చేస్తున్నాయి. ఈక్రమంలో మేత మేస్తున్నాయి. ఈక్రమంలో విద్యుత్ తీ గలు తెగి ఆవులపై పడ్డాయి. దాంతో అక్కడికక్కడే మృతి చెందాయి. ఇటీవలే ఒక ఆవును రూ.75 వేలకు, మరో ఆవును రూ.65 మరో ఆవు 70 వేలకు కొనుగోలు చేసినట్లు బాధిత రైతులు తెలిపారు. ఆవులు మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. పాడిఆవులు మృతి చెందడంతో జీవనాధారం కోల్పోయామని, ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వారు కోరారు.