
జన సముద్రం, జూన్ 16 (క్రైమ్ రిపోర్టర్ ఖాజా పాషా):
సంగారెడ్డి జిల్లా హాత్నూర్ మండలం కసాల గ్రామంలో అపరిశుభ్రత సమస్య తీవ్రంగా నెలకొంది. గ్రామానికి సమీపంలో ఉన్న దేవులపల్లి దగ్గర కొలతల కంపెనీ (కోడ్ల కంపెనీ) నుండి వస్తున్న దుర్వాసన వల్ల గ్రామస్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామస్తులు అనేకసార్లు కంపెనీ యాజమాన్యాన్ని మరియు సంబంధిత అధికారులను కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దుర్వాసన కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు సహా ప్రతి ఒక్కరికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.
తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను వేడుకున్నారు.