
-ముందస్తుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మా వల్ల ప్రమాదానికి కారణాలు విద్యుత్ అధికారులు తెలుపకపోకపోవడం వల్లనే ప్రమాదం
నియోజకవర్గం జన్నారం మండలంలోని ప్రతి ట్రాన్స్ పార్మ చుట్టూ కంచె ఏర్పాటు చేసే విధంగా విద్యుత్ అధికారులు యజమానికి తెలపాలి
విద్యుత్ వైర్లు వలన పొలాలలో గ్రామాలలో ప్రమాదం జరగకుండా విద్యుత్ అధికారులు చూడాలి
, ఖానాపూర్ నియోజకవర్గం జూన్ 15 (జన సముద్రం న్యూస్): మండలంలోని సోనాపూర్ గ్రామం శివారులోని లోతుర్రే మార్గం మధ్యలో సోయం సంగీత చెందిన ఆవు ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మా వైరుకు తగిలి షాక్ కు గురై మృతి చెందింది. ముందస్తుగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మా చుట్టూ కంచె వేయాలని విద్యుత్ అధికారులు ఆ భూమి యజమానికి తెలియపరచాలి. జాగ్రత్త పాటించకపోవడం వల్ల ఒక మూగ జీవి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగ కు తగిలిన సోనాపూర్ తండా శివారులోని ఉన్న పొలంలో ఉన్న ట్రాన్స్ఫారం కి తగిలి ఆవు అక్కడికక్కడే మృతి చెందినట్లు సోయం సంగీత తెలిపారు. విద్యుత్ వైర్లు రైతు పొలలలో గ్రామాలలో వేళడకుండా విద్యుత్ అధికారులు రైతులకు ప్రజలకు ముందస్తు సమాచారం తెలపాలి. మృతి చెందిన ఆవు విలువ సుమారు 60 వేలకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. స్పందించి మృతిచెందిన ఆవు యజమానురాలు కు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.