
జనసముద్రం న్యూస్, ఏలూరు జిల్లా ప్రతినిధి, జూన్ 15
ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల, రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు సగటున 15 వేల మంది సందర్శించే పర్యాటక ప్రాంతము మరియు మండల కేంద్రం అయినా ద్వారకాతిరుమల గ్రామంలో రెవెన్యూ శాఖ వారి కనుసన్నలో జరుగుతున్న భూ ఆక్రమణలు మరియు పట్టాలు, పొజిషన్ పత్రాలు ద్వారకా తిరుమల రెవిన్యూ అధికారులు పంపిణీ చేయడం జరుగుతుంది, గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 350 ఎకరాల ప్రభుత్వ భూమి, పొలిమేర పుంతలు, వాగులు, చెరువులు, ప్రధాన రహదారులు మార్జిన్ స్థలాలు యావత్తు ఇక్కడ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వలన అన్యాక్రాంతమైనవి అని దీనికి తోడు పక్క గ్రామాల్లో ఇల్లు ఇళ్ల స్థలాలు కలిగి ఉన్న అనర్హుల కు వేరే గ్రామాల్లో ప్రభుత్వం ఇల్లు పొందిన లబ్ధిదారులకు, ద్వారకాతిరుమల గ్రామంలో ఇళ్ల స్థలాలు కేటాయించి స్థానిక రెవిన్యూ అధికారులు తమ ఇష్టాను రీతిలో ఎంజాయ్మెంట్ పత్రాలను మంజూరు చేయడం జరుగుతుందని, ఈ విధంగా పొరుగు గ్రామాల వారికి ఇక్కడ స్థలాలకు స్వాధీన పత్రాలను మంజూరు చేయడం జరుగుతుందని, ఈ విధంగా ద్వారకాతిరుమల గ్రామంలో జరుగుతున్న భూ అక్రమాలకు అరికట్టాలని ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన స్థానికుడు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కేస్ నెంబర్ :కేస్ నెంబర్:311/2025/బి2/ఎల్ఓకే /6315/2025 వారిని ఆశ్రయించగా లోకాయుక్త వారు ద్వారకాతిరుమల ఆలయం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మరియు ఈ స్థలాన్ని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు, ద్వారకాతిరుమల గ్రామంలో నీటి వనరులు మరియు ప్రభుత్వ భూముల లోకి జరిగిన ఆక్రమణ గురించి ఫిర్యాదుదారుడు ఆరోపణలు చేశాడు, ఆక్రమణల తొలగింపుకు కొన్ని చట్టపరమైన విధానాలు ఉన్నాయి, అందువల్ల ఈ ఫిర్యాదును ద్వారకాతిరుమలలోని ప్రభుత్వ మరియు ఎండోమెంట్ భూములను గుర్తించడానికి సర్వే చేయడానికి మరియు రక్షించడానికి ఒక విప్లవాత్మకమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్ మరియు ఎండోమెంట్ అధికారికి పంపబడింది, ఆక్రమణల తొలగింపుకు చట్టపరమైన ప్రక్రియకు కట్టుబడి ఉండేలా చూసేందుకు ఒక వివరాణాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు, తిరిగి పొందిన భూములను ప్రజా వినియోగాలు, గ్రామ అభివృద్ధి మరియు ఫైలరిస్ సౌకర్యాలకు కేటాయించాలి, ఈ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త వారు అతనికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది,ఈ ఆర్డర్ విషయంలో ద్వారకాతిరుమల రెవిన్యూ అధికారులు మరియు ఉన్నతాధికారులు ఏమి చేస్తారో వేచి చూడాలి.