జన సముద్రం న్యూస్, కోహెడ, జూన్ 4:(కోహెడ ప్రసాదరావు)
సబ్సిడీ పై విత్తనాలను రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు ఖమ్మం వెంకటేశం అన్నారు. మంగళవారం ఈ మేరకు ఆయన మాట్లాడుతూ,
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు శాంపిల్ గా గ్రామంలో ముగ్గురు రైతులకు 50 రూపాయలకే వరి విత్తనాల బస్తాలు అందజేయాలని నిర్ణయించిందని, దీనికంటే రైతులందరికీ సబ్సిడీ ద్వారా విత్తనాలు సరఫరా చేయటం బాగుంటుందని ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లు ఇచ్చి రైతులను ఆదుకొన్నాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక టిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో వ్యవసాయ పరమైన సబ్సిడీలు ఎత్తేశారని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తిరిగి విత్తనాలపై వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీని ప్రవేశపెట్టి రైతులందరికీ ఆసరాగా నిలవాలని ఆయన కోరారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ నుండి గ్రామానికి ముగ్గురి చొప్పున ఒక్కో బస్తా 50 రూపాయలకు శాంపిల్ గా ఇచ్చే వరి బస్తాలకు బదులుగా సబ్సిడీపై రైతులందరికీ అవసరమైన విత్తనాల బస్తాలను అందిస్తే రైతులు హర్షిస్తారని అన్నారు. అలాగే రైతులకు ఆర్థిక భారము తగ్గి మరింత ఉత్సాహముతో కష్టపడి పంటలు పండించేందుకు ముందుకు వస్తారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను అందించేందుకు పునరాలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.





