జన సముద్రం న్యూస్ కోహెడ మే 20:( కోహెడ ప్రసాదరావు )
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో సోమవారం నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవోపేతముగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నవగ్రహాలను ప్రతిష్టించడంలో భాగంగా తొలుతగా గణపతి పూజ పుణ్యాహవాచనం నవగ్రహ ఆరాధన నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ మాలా దీక్ష ధారులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో బ్రహ్మశ్రీ డాక్టర్ కోహెడ ప్రసాదరావు శర్మ వైదిక నిర్వహణలో బ్రహ్మశ్రీ చౌడుభట్ల రఘు రామ శర్మ, డాక్టర్ రామక మోహన్ శర్మలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నవగ్రహ రాతి విగ్రహాలను శుద్ధి మంత్రములతో వేదోకముగా జలాధివాసము, దాన్యాధివాసము, పుష్పాది ఫలాదివాసము కార్యక్రమాలను నిర్వహించడంలో భాగంగా తొలత పంచామృతములతో అభిషేకించి విగ్రహాలను నీటిలో పెట్టి శుద్ధి పరిచారు. అనంతరం హోమం కార్యక్రమం నిర్వహించే సుముహూర్తములో నవగ్రహ విగ్రహాలను యంత్ర ప్రతిష్ట తదనంతరం విగ్రహ ప్రతిష్ట గావించారు. అనంత రం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ మాల దీక్ష దారుల భజనలు కీర్తన లతో ఆలయం మారు మ్రోగింది. గ్రామంలోని ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళలు, భక్తులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.





