రాయచోటి, జనసముద్రం న్యూస్ మే 20:-
రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ఉదయం రాయచోటి పట్టణంలోని తమ కార్యాలయం నందు వర్షంలో తడుస్తూ ప్రజల సమస్యలు వింటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు.

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ఉదయం విజయవాడకు వెళ్లాల్సి ఉంది కాగా మంత్రివర్యులు క్యాంపు కార్యాలయానికి చేరుకోగానే అర్జీదారులు తమ సమస్యల పరిష్కారార్థం పలు సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. వర్షం వస్తున్నప్పటికీ మంత్రి ఏమాత్రం విసిగించుకోకుండా బాధితుల సమస్యలను ఓపికగా, సహనంతో వింటూ వారి సమస్యలను పరిష్కరించడం జరిగింది. దీంతో పలువురు ప్రజలు మంత్రివర్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





