పల్నాడు బ్యూరో జనసముద్రం న్యూస్ (గుంటూరు), మే 20.
స్వర్ణాంధ్ర నగర్ కు చెందిన బుజ్జి అనే మహిళ తనకు అన్యాయం జరుగుతుందని కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎలుకల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.1998లో ప్రభుత్వం వారికి ఇచ్చిన ప్లాట్లు ను మౌలాలి అనే రౌడీ షీటర్ తమ స్థలాలను ఆక్రమించుకుని ఇబ్బందులు పేడుతున్నారని ఎన్నోసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరియు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగటం లేదని వాపోయారు. అనంతరం బాధితురాలిని అరండల్ పేట ఎస్సై రోజారాణి జి జి హెచ్ కి తరలించారు…
బాధితురాలు జొన్నలగడ్డ జ్యోతి కామెంట్స్..
బాధితురాలు జొన్నలగడ్డ జ్యోతి మాట్లాడుతూ 1998లో వసంత రాయపురం ట్యాంకుల నిర్మాణానికి భూసేకరణ కింద తమ స్థలాలను ప్రభుత్వం తీసుకుందని.. దానిలో భాగంగా స్వర్ణాంధ్ర నగరంలో తమకు స్థలాలను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలాలను అదే ప్రాంతానికి చెందిన మౌలాలి ( రౌడీ షీటర్) మరియు అతని భార్య కలిసి తమ స్థలాలను కబ్జా చేశారని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసారు.ఎన్నోసార్లు తమ గోడును ప్రభుత్వ అధికారులు ముందుకు తీసుకు వచ్చినా కనీసం తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన చెందారు.ఈ సమస్య విషయమై ప్రభుత్వ అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన న్యాయం జరిగనందుకే ఈరోజు బుజ్జి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలియజేశారు.





