పకడ్బందీ వ్యూహంతో అత్యుత్తమ విద్యా ఫలితాలు

Spread the love

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జనసముద్రం న్యూస్

మహబూబాబాద్ జిల్లా
పాఠశాలలు,వసతి గృహాలు అన్ని విద్య సంస్థలకు జిల్లా అధికారులను ప్రత్యేకంగా నియమించి క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ
జిల్లాలో (162) పాఠశాలలలో 100% ఉత్తీర్ణత జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆండ్రూ రవీందర్ రెడ్డి
జిల్లా లోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు 201 లో 162 పాఠశాలలు 100% results సాధించినవి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 582,580,579,574,563 మార్కులు సాధించినారు.
మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలోనే పదవ తరగతి ఫలితాలలో మొదటి స్థానంలో రావడానికి గల కారణాలు
నవంబర్ నెల నుండి ప్రత్యేక తరగతులు పదవ తరగతి విద్యార్థులకు ఉదయం సాయంత్రం వేళలో నిర్వహించడం, విద్యార్థులకు స్పెషల్ టెస్టులు, వీక్లీ టెస్టులు గ్రాండ్ టెస్టులు, ప్రీఫైనల్స్ నిర్వహించి, అట్టి పరీక్ష పేపర్లను వెంటవెంటనే వాల్యుయేషన్ చేసి వాటిలో విద్యార్థులు చేస్తున్న తప్పులని సరిచేసి విద్యార్థులు ఇంకా ఎక్కువ అభివృద్ధి కావడానికి సబ్జెక్టు టీచర్లు ,హెడ్మాస్టర్లు నిరంతర పరిశ్రమ పర్యవేక్షణ చేశారు, అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి పరీక్షల ముందు వరకు స్కూల్ కి హాజరయ్యేలా విద్యార్థులని, వారి తల్లిదండ్రులని ప్రోత్సహించి రేపు ఎగ్జామ్ అనే వరకు కూడా జిల్లాలోని ఏ విద్యార్థి కూడా పాఠశాలకు గైర్హాజరు కాకుండా తగిన చర్యలు చేపట్టడం జరిగినది. అదేవిధంగా ఏ విద్యార్థి అయినా ఏ కారణం చేత అయినా పాఠశాలకి రానియెడల అట్టి ప్రధానోపాధ్యాయులు వారి తల్లిదండ్రులను సంప్రదించి వారు పాఠశాలకు వచ్చేలా తగిన చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా విద్యార్థులు కేవలం పుస్తకాలు మాత్రమే కాకుండా వారికి అదనపు సమాచారము నిమిత్తము స్టడీ మెటీరియల్స్ జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు దాతల సహాయంతో స్టడీ మెటీరియల్ అందింపచేసే కార్యాచరణ నవంబర్ నెలలోనే నిర్వహించడం జరిగింది. దానివలన విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలే కాకుండా అదనపు సమాచారం నిమిత్తం స్టడీ మెటీరియల్ ఉపయోగపడింది. ఇంకా సబ్జెక్టు ఫోరమ్స్ తో సమావేశాలు నిర్వహించి ప్రతి సబ్జెక్టులో మెలకువలు,విద్యార్థులు సులభంగా పరీక్షలో విజయం సాధించే పద్ధతులు అందరు పాఠశాలల్లో ఉపయోగించేలా తగిన కార్యాచరణ చేపట్టబడినది. అంతేకాకుండా సబ్జెక్టు ఉపాధ్యాయులతో, ప్రధానోపాధ్యాయులు ప్రతి పరీక్ష తర్వాత సమీక్ష నిర్వహించి విద్యార్థుల పురోగతిని పరిశీలించి వెనుకబడిన విద్యార్థులకు కావలసిన సహాయాన్ని అందజేయడం జరిగినది. జిల్లా స్థాయిలో ప్రధానోపాధ్యాయుల సమావేశము, వాటిలో విద్యార్థుల యొక్క ప్రగతికి సంబంధించిన రివ్యూ కూడా గౌరవ కలెక్టర్ గారి పర్యవేక్షణ లో చేపట్టడం ఈ విజయానికి దోహద పడింది.
జిల్లాలోని ప్రతి విద్యాసంస్థ వసతిగృహం పాఠశాలకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. వారు
నిరంతరం పర్యవేక్షణ చేయడం ద్వారా ఇట్టి ఫలితాలు సాధ్యమైనవి.
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి, ల నిరంతర సమీక్షలు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని, డిఈఓ రవీందర్ రెడ్డి తెలిపారు,
ఫలితాలు వెలబడిన అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన విద్యాశాఖ అధికారులు, డిఈఓ రవీందర్ రెడ్డి, బిసి వెల్ఫేర్ అధికారి నరసింహస్వామి, సైన్స్ ఆఫీసర్ అప్పారావు, ఏడి రాజేశ్వరరావు, ఏసీజీఈ శ్రీరాములు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ పూర్ణచంద్రర్ , అజాద్ చంద్ర శేఖర్, విజయ కుమారీ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!