పల్నాడు బ్యూరో జన సముద్రం న్యూస్, .
పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ
పోలీసు శాఖలో చేరి గత 32 సంవత్సరాల కాలం పాటు విశేష సేవలు అందించి పదవీ విరమణ పొందిన సబ్ (స్పెషల్ బ్రాంచ్) రైటర్ గా విధులు నిర్వహిస్తున్న ఎఎస్సై ( ఏ ఎస్ ఐ -2838, జి వి ఎస్ ఆర్ ఆంజనేయులు) ను బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండి వారి సాధకబాధకాల్లో మమేకమై సేవలందించే అవకాశం పోలీసుశాఖ లోనే అధికంగా ఉంటుందన్నారు. పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 32 సం’ల కాలం పాటు పోలీసుశాఖ లో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు.
పదవీ విరమణ ప్రతి ఒక ఉద్యోగికి తప్పదని, ఉద్యోగంలో ఉన్నపుడు చేసిన సేవలే ఉద్యోగ అనంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు, ప్రఖ్యాతలు తెస్తాయన్నారు.
ఉద్యోగ నిర్వహణలో ఎంతో నిబద్దత, అంకితభావంతో పోలీస్ శాఖకు అందించిన సేవలను పోలీసు శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.
సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేటట్లు అన్ని చర్యలు తీసుకుంటామని, వచ్చిన నిధులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని,ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఇకపై కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు.
భవిష్యత్తులో వారికి ఏ సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అడ్మిన్ ఎస్పి జె.వి సంతోష్ , వెల్ఫేర్ ఆర్.ఐ ఎల్ . గోపీనాథ్ ,ఏ ఏ ఓ టీ.దుర్గా ప్రసాద్ పల్నాడు జిల్లా పోలీసు సంఘ అధ్యక్షులు టీ.మాణిక్యాల రావు ,సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.





