జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ ఏప్రిల్ 30
మహబూబాబాద్ జిల్లా
స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, ద్వారా గ్రామీణ, విద్యా సంస్థలలో, మరుగుదొడ్లు నిర్మించాలన్నారు, జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు,
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ గ్రామీణ మిషన్ ద్వారా మంజూరైన పథకాలను గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం స్వచ్ఛత సంరక్షణ పారిశుద్ధ్యం పరిశుభ్రత పాటించడం శ్రేష్ఠ భారత్ మిషన్ ద్వారా గ్రామీణ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, రైతు వేదికలు, గ్రామ పంచాయతీ భవనాలలో, జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశాలలో వారి సౌకర్యార్థం స్త్రీ, పురుషులకు వేరువేరుగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు,
రహిత గ్రామాలుగా వ్యర్ధాల నిర్వహణ క్రమబద్ధీకరణ అంశాలు, సెగ్రిగేషన్చేయాలన్నారు,
గ్రామాలు పట్టణాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం నీరు నిలవకుండా చర్యలు తీసుకోవడం,
డంపింగ్ యార్డ్ల నిర్వహణ, వ్యక్తి గత మరుగుదొడ్లు కమ్యూనిటీ మరుగుదొడ్లు, నిర్మించాలని, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు,
జిల్లాకు కేటాయించిన స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలను అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి పూర్తి చేయాలని సూచించారు,
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జెడ్పి సీఈవో పురుషోత్తం, డి ఏ ఓ విజయనిర్మల, డిఇఓ రవీందర్ రెడ్డి, డిపిఓ హరిప్రసాద్, వెల్ఫేర్ అధికారిని ధనమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దేశి రామ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రవి, డి డి గ్రౌండ్ వాటర్ సురేష్, స్వచ్ఛభారత్ ఎస్బిఎంలు శ్రీమాన్, రవికుమార్, మిషన్ భగీరథ సంబంధిత అధికారులు
పాల్గొన్నారు.





