ధర్మ వరం,జన సముద్రం న్యూస్,ఏప్రిల్,30:
ఎలక్ట్రానికి ఓటింగ్ మిషన్ల గోడౌన్ ను జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ తనిఖీ చేశారు.మంగళవారం ధర్మవరం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న ఈవిఎం యంత్రాలు,వివిప్యాట్ లు భధ్రపరిచిన గోడౌన్ ను తనిఖీ చేశారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖిలో భాగంగా ఈవిఎం గోడౌన్ కు వేసిన భధ్రతా సీళ్లు,సిసి కెమెరాలు పనితీరు,అగ్నిమాపక దళ పరికరాలు మొదలైనవి పరిశీలించారు.అనంతరం సెక్యూరిటీ లాగ్ బుక్ ను పరిశీలించి అందులో సంతకం చేశారు.ఈవిఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు,ఆర్డిఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు.





