జనసముద్రం న్యూస్ ఏప్రిల్ 29( గుత్తి )
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణం తాడపత్రి రోడ్డుకు చెందిన కుమ్మెత రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రెటరీగా ఎన్నికయినందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి కి, గుంతకల్లు మాజీ శాసనసభ్యులు వై.వెంకట్రామిరెడ్డి కి, జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి కి, గుంతకల్లు వైఎస్ఆర్ పార్టీ యువ నాయకుడు సిబి మంజునాథ్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.
నాకంటూ ఒక గుర్తింపును ఇచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి రుణపడి ఉంటాను అని తెలియజేశారు. అంతేకాకుండ పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేస్తానని పార్టీ కి కట్టుబడి ఉంటానని చెప్పారు.





